- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19 విమానాల్లో 3,726 పౌరులు స్వదేశానికి: వెల్లడించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరుల తరలింపుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా శుభవార్త చెప్పారు. గురువారం ఒక్క రోజే 19 విమానాల్లో 3,726 మంది పౌరులను స్వదేశానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఆపరేషన్ గంగా మిషన్‌లో ఈరోజు(గురువారం) 3,726 మంది పౌరులను స్వదేశానికి తీసుకొస్తున్నాం. బుకారెస్ట్ నుంచి ఎనిమిది, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్జో నుంచి మూడు, సుసెవా నుంచి రెండు, కోసిస్ నుంచి ఒక విమానం బయల్దేరాయి' అని ట్వీట్ చేశారు. వీటిలో భారత వాయు దళానికి చెందిన విమానాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. పౌరులు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నాక భారత ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 'భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించేందుకు సరైన చర్యలు తీసుకుంది. భారతీయుడిగా గర్విస్తున్నాను. ఇతర నగరాలలో చిక్కుకున్న భారత పౌరులను వీలైనంత త్వరగా తరలించాలి' అని భారత విద్యార్థి అన్నారు. కాగా ఢిల్లీ చేరుకున్న పౌరులకు తల్లిదండ్రులు, బంధువులు ఘనంగా స్వాగతం పలికారు.