- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటినుంచి వాటిల్లో నటించను.. సమంత సంచలన కామెంట్స్.. నాగ చైతన్య కోసమేనా అని అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) దాదాపు ఏడాది తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ‘ది ఫ్యామిలి మాన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: HoneyBunny) అనే వెబ్ సిరీస్‌తో మనముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరులో ఉన్నారు చిత్ర బృదం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. అక్కడ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మళ్లీ ఐటెం సాంగ్స్‌లో నటిస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. లేదు చెయ్యను అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది ఈ భామ. ఇప్పుడు పుష్ప 2 లో కూడా మరో ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ ఇంటర్వ్యూతో అవన్నీ పుకార్లే అని క్లారిటీ ఇచ్చింది సామ్. అలాగే మీరు సింగిల్ గానే ఉండాలని అనుకుంటున్నారా అంటే లేదని సమాధానం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మింగిల్ అవ్వడానికి రెడీగా ఉందని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయడం వల్లనే నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య కోసమే మళ్లీ సామ్ ఐటెం సాంగ్స్‌లో నటించకూడదు అని ఫిక్స్ అయినట్లుగా నెటిజన్లు అనుకుంటున్నారు.
Read more ...
Samantha: ఇతరులను జడ్జ్ చెయ్యడం ఆపండి.. ఆ ప్రశ్న అడగంతో నెటిజన్‌పై సమంత ఫైర్