పెళ్లి చేసుకోను.. కానీ పిల్లల్ని కంటానంటూ టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-26 14:29:11.0  )
పెళ్లి చేసుకోను.. కానీ పిల్లల్ని కంటానంటూ టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్ తేజస్వి(Tejaswi Madiwada) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’(Life is Beautiful) మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలో చాన్స్ కొట్టేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు ప్రజెంట్ ‘అర్థమైందా అరుణ్ కుమార్-2’(Ardhamaindha Arun Kumar-2) సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇది అక్టోబర్ 31నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి(Tejaswi Madiwada) పెళ్లి, పిల్లలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మీరు జీవితంలో ఎక్కువగా దేనికి భయపడతారు? అని యాంకర్ అడగ్గా.. దానికి తేజస్వి.. ‘‘నా పెళ్లంటేనే చాలా భయం.

జీవితంలో చేసుకోవద్దని ఫిక్స్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని భావించవచ్చా? అని అడగ్గా.. ‘‘నేను నిజంగానే పెళ్లి చేసుకోను. ముఖ్యంగా నాకు ఏజ్ అయిపోవాలని చూస్తున్నాను. ఎందుకంటే.. ఏజ్ అయిపోతే నన్ను ఎవరూ చేసుకోవడానికి అంగీకరించరు కాబట్టి. కానీ పిల్లలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నాకు పిల్లలు పుడతారు.. దానికి ఇంకా ఐదు సంవత్సరాల టైమ్ ఉంది. ఈ లోపు పిల్లల్ని కంటాను’’ అని షాకింగ్ కామెంట్స్ చేసి యాంకర్‌కు దిమ్మతిరిగేలా చేసింది. ప్రజెంట్ తేజస్వి కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story