చిరంజీవి బెగ్గింగ్ చూసి బాధపడ్డా.. సీఎం జగన్‌తో భేటీపై ఆర్జీవీ కామెంట్స్

by Disha News Web Desk |
చిరంజీవి బెగ్గింగ్ చూసి బాధపడ్డా.. సీఎం జగన్‌తో భేటీపై ఆర్జీవీ కామెంట్స్
X

దిశ, సినిమా : కొద్ది నెలలుగా ఏపీ గవర్నమెంట్- టాలీవుడ్‌ మధ్య థియేటర్ల టికెట్ రేట్లపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై పలుమార్లు చర్చలు జరిగినా విషయం కొలిక్కి రాలేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ తదితర సినీ ప్రముఖులు నిన్న సీఎం జగన్‌ను కలిసి చర్చించారు. అయితే సినీ పెద్దల మీటింగ్‌పై డైరెక్టర్ ఆర్జీవీ మిడ్ నైట్ ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. ఈ సమావేశంలో మెగాస్టార్‌ వ్యవహారాన్ని మెగా బెగ్గింగ్‌గా పోల్చుతూ తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేశాడు.

ఇక చిరంజీవిని ట్యాగ్ చేస్తూ చేసిన ఈ ట్వీట్లను డిలీట్ చేసిన వర్మ మరో ట్వీట్‌లో ఈ మీటింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఇది జరిగినప్పటికీ.. ఒమెగాస్టార్ వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించినందుకు సంతోషిస్తున్నా. ఈ విషయంలో సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబల్‌ను అభినందిస్తున్నాను' అని పోస్టు చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్లపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Next Story

Most Viewed