- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana High Court : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల(MLA's) అనర్హత కేసు మంగళవారం హైకోర్టు(High Court)లో విచారణకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై నాలుగు వారాల్లో అనర్హత వేటు వేయాలని, లేదంటే తామే సుమోటోగా తీసుకొని ఆయా ఎమ్మెల్యేలపై వేటు వేస్తామని అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పునిచ్చారు. అయితే హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టగా.. అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు లేదని ఏజీ వాదించారు. కాగా ఈ కేసుపై న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు.