- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Thummala: పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 82.44 కోట్ల రూపాయల విలువైన 11,255 టన్నుల పత్తిని 5,251 మంది రైతుల నుండి కొనుగోలు చేశామని పేర్కొన్నారు. గత సంవత్సరంలో ఇదే సమయానికి కేవలం 3.91 కోట్ల రూపాయలతో 560.37 టన్నుల పత్తిని 233 మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సీసీఐ ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఎక్కువ పత్తిని కొనుగోలు చేసిందని, రానున్న రోజుల్లో రైతులందరూ పత్తిని ఆరబెట్టుకుని సీసీఐ నిబంధనలను అనుసరించి తేమశాతం 8 నుంచి 12శాతం ఉండేలా చూసుకుని మద్దతూ ధరను పొందాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులు కోరుతున్నట్టు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులు లూజ్ కాటన్‌ను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుందన్నారు. రైతులు గన్ని బస్తాలలో పత్తిని తెచ్చినా కూడా సీసీఐ వారీ నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయరని, సంచులలో కొనుగోలు వలన పత్తి పాడయ్యే అవకాశం ఉంటుంది.
సీసీఐ కొనుగోళ్లలో రైతులకు సంచి ధర చెల్లింపు లేదన్నారు. రైతులు మార్కెట్ యార్డుకు లూస్ కాటన్ తెచ్చిన మార్కెట్ యార్డు నుంచి జిన్నింగ్ మిల్లులకు వెళ్లే రవాణా ఖర్చుతో పాటు మార్కెట్లో లోడింగ్, అన్‌లోడింగ్ ఖర్చులు రైతుల మీద భారం పడుతుందని మంత్రి వెల్లడించారు. రైతులకు ఈ భారం ఉండకూడదనే మార్కెట్ యార్డుకు సమీపంలో ఉన్న, సీసీఐ వారు నోటిఫై చేసిన ప్రతి ఒక్క జిన్నింగ్ మిల్లులు పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిన్నింగ్ మిల్లులు పూర్తి స్థాయి సిబ్బందితో పనిచేయాలని, రైతులకు వీలుగా ఉండేటట్లు ఎంత సమయం వేచి ఉండాలో తెలుసుకునే విధంగా యాప్‌ను రూపొందించారని పేర్కొన్నారు. ఈ యాప్‌ను రైతులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఇబ్బందులకు గురికాకుండా సీసీఐ సెంటర్లలో పత్తిని విక్రయించి అధిక మద్దతు ధరను పొందాలని కోరారు.
జిల్లా కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు జిన్నింగ్ మిల్లులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, 8897281111 వాట్సాప్ నెంబర్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును మార్కెటింగ్ శాఖ సంచాలకులు పరిశీలించి, తిరిగి ఫోన్ ద్వారా రైతుల ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ రోజు వరకు 188 ఫిర్యాదులను స్వీకరించగా, 157 ఫిర్యాదులను పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, ఎలాంటి సమస్యలు ఉన్న వాట్సాప్ చాట్ ద్వారా తెలియజేయాలని రైతులకు మంత్రి సూచించారు.