- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ తెలంగాణ పర్యటన గ్రాండ్ సక్సెస్...శభాష్ ఉత్తమ్ అంటూ ప్రశంసలు
దిశ; తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఘన స్వాగతం పలికింది. మంగళవారం సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీని, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్, క్యాబినేట్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు రిసీవ్ చేసుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా ఆయన రోడ్డు మార్గాన బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వెళ్లారు. అయితే టీపీసీసీ ఫ్రంటల్ ఆర్గరైజేషన్స్ అధ్వర్యంలో దాదాపు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్నారు. ఇందులో 200 మంది పార్టీ, ప్రభుత్వంలోని కీలక నేతలు ఉండగా, వివిధ యూనివర్సిటీల నుంచి ప్రోఫెసర్లు, బీసీ సంఘాలకు చెందిన ముఖ్యులు, ఎస్సీ, ఎస్టీ సంఘాలకు చెందిన కీలక వ్యక్తులు, మేధావులు, విద్యార్ధి నాయకులు కలిపి మరో 200 మంది వరకు పాల్గొన్నారు. ఐడియాలజీ సెంటర్‌లో దాదాపు గంట సేపు వరకు రాహుల్ చర్చించారు. ‘కుల గణన ఎందుకు చేయాల్సి వస్తుంది?. దీని ఆవశ్యకత ఏమున్నది?. చేయడం వలన ప్రజలకు కలిగే లాభాలు ఏమిటీ?. దేశ వ్యాప్తంగా చేయాల్సిన ఆవశ్యత ఎంత వరకు ఉన్నది?. అందుకు కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి?. చట్టబద్ధంగా ఎలా తీసుకురావాలి?.’ వంటి అంశాలపై రాహుల్ చర్చించారు. ఈ డిస్కషన్‌లో జరిగిన ప్రతీ అంశాన్ని మినిట్ రూపంలో రాహుల్ సేకరించినట్లు పార్టీ కి చెందిన ఓ నేత తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత దేశ వ్యాప్తంగా వివిధ స్థాయిలలోని ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయాలని భావించిన జన గణనను తెలంగాణను ప్రమాణికంగా తీసుకోవాలని రాహుల్ ప్రెజర్ చేయనున్నారు. ఐడియాలజీ సెంటర్‌లో సేకరించిన వివరాలు, అంశాలను రాహుల్ రిపోర్టు రూపంలో పార్లమెంట్ సభ్యులకు అందజేయాలని భావిస్తున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.
ఇక పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మహైదరాబాద్ కు రావడం ఇదే మొదటి సారి. దీంతో ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పీసీసీ పకడ్భందీగా ప్లాన్ చేసింది. బోయిన్ పల్లిలోని ఐడియాలజీ సెంటర్లో అతిధిలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సెక్యూరిటీ రీజన్స్ తోటి ప్రత్యేక పాస్ లను కేటాయించారు. పాస్ ఉన్నోళ్లను మాత్రమే ఐడియాలజీ సెంటర్ కు అనుమతించారు. సెమినార్ కోసం ఆహ్వానించిన అధితులకు కేటగిరీలుగా సీటింగ్ ను ఏర్పాటు చేశారు. వారికీ ప్రత్యేక పాస్ లు ఇచ్చారు. ఇక సోమవారం సాయంత్రం నుంచే పీసీసీ చీఫ్, హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాహుల్‌కు భారీగా స్వాగతం పలికేందుకు హైదారాబాద్ చుట్టూ పక్కల నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో జన సమీకరణ కూడా చేశారు. దీంతో పాటు బేగంపేట్ నుంచి బోయిన్ పల్లి వరకు రాహుల్‌కు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రతిపక్ష నేత రాహుల్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇచ్చిన మాటకు కట్టుబడినందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపడుతున్నామన్నారు. రాజ్యాంగ ప్రవేశికను అమలు పరచడం, ప్రవేశికలో అన్నింటినీ ఆచరణలో పెడతామని చెప్పారు. కుల గణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని, ఆ తీర్మానం ఆధారంగా జీవోనూ విడుదల చేశామన్నారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన ప్రారంభం కావడం సంతోషంగా ఉన్నదన్నారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధి తో పని చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల సమయంలోను కులగణన చేపడుతామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దాన్ని నెరవేర్చే ప్రాసెస్ ను మొదలు పెట్టారన్నారు. ఆ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. కుల గణన చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పామని, వంద శాతం దాన్ని సంపూర్ణంగా నెరవేర్చుతామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామన్నారు. కుల గణన కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫీల్డ్ స్టడీ చేశామని, ప్రభుత్వం వద్ద సమగ్రమైన ప్లాన్ ఉన్నదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో జనాభా లెక్కల ప్రకారం బీసీల కు రిజర్వేషన్ పెంచుతున్నామని, ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ను కూడా వేశామన్నారు.
శభాష్ ఉత్తమ్ జీ : రాహుల్ ప్రశంసలు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశంసించారు. బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సెమినార్ లో రాహుల్ స్పీచ్ ను మంత్రి ఉత్తమ్ ట్రాన్స్ లెట్ చేశారు. రాహుల్ మాట్లాడిన ప్రతి పదాన్ని తెలుగులో సంపూర్ణంగా అనువధించారు. స్పష్టమైన పదాలు, ప్రజలందరికీ అర్ధమయ్యే రీతిలో మంత్రి ఉత్తమ్ తెలుగులో వివరించారు. రాహుల్ తన స్పీచ్ ను ముగించిన తర్వాత, ‘‘థాంక్యూ ఉత్తమ్ రెడ్డి జీ..ఫర్ ది ఎక్స్ లెంట్ ట్రాన్స్ లేషన్” అంటూ రాహుల్ కాంప్లిమెంట్ ఇచ్చారు.