Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్‌తోనే ఈ సినిమా తీశా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by sudharani |
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్‌తోనే ఈ సినిమా తీశా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ (Matka). 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మట్కా సినిమా కోసం మెగా ఫ్యాన్స్ (Mega Fans)తో పాటు.. సినీ ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vira Entertainments), SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ మీడియాతో ముచ్చటించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘మట్కా’ ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు బర్మా నుంచి వైజాగ్ (Vizag)కి ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్‌లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ (Powerful Persons) అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అప్పటి వైజాగ్ వెనుక ఉన్న క్రైమ్ (crime), గ్లామర్ (glamour), కాస్మోపాలిటన్ కల్చర్ (Cosmopolitan Culture) ఇవన్నీ కథలో భాగమే. సినిమా చూడండి. 100% మీకు క్లియర్‌గా అర్థం అయిపోతుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఆ సీన్లన్నీ తీయడం జరిగింది. మట్కా ఎలా వచ్చింది.. దాన్ని ఎలా కొనసాగించారు? ఇవన్నీ చాలా క్లియర్‌గా మీకు అర్థం అవుతాయి. సెల్ ఫోన్ (cell phone) లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్‌ని పంపించడం అనేది ఈ కథలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ (interesting point). నిజంగా అది ఎలా జరిగిందో ఇప్పటికి నాకు తెలియదు. ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయుంటే ఏం చేసేవాడిని అని తనలా ఆలోచించి ఆ ఐడియాస్‌తో ఈ స్క్రిప్ట్‌ని చేశాను. తప్పకుండా అందరికి రీచ్ అవుతోంది’ అని చెప్పుకొస్తూ.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రిఫరెన్స్‌తోనే ఈ సినిమా తీశాను అని తెలిపారు. ఇక తన తదుపరి ప్రాజెక్టులు గురించి మాట్లాడుతూ.. ‘మూడు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఏది ముందుగా సెట్స్ వెళుతుందో తర్వలోనే తెలుస్తుంది’ అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed