- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Pallavi: రాత్రిళ్లు నిద్ర లేకుండా అలా చేస్తే.. తట్టుకోలేక ఏడ్చేశా.. సాయిపల్లవి ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తెలుగులో ‘ఫిదా’(Fida) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత శ్యామ్‌సింగరాయ్, లవ్‌స్టోరీ(Love Story) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల శివ కార్తికేయన్(Sivakarthikeyan) సరసన ‘అమరన్’ సినిమాలో నటించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్(Major Mukund Varadarajan) బయోపిక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘శ్యామ్ సింగరాయ్(Shyam Singarai) సమయంలో ఆ రోజుకు సంబంధించిన షూట్ పూర్తయితే ఎంతో ఆనందపడేదాన్ని. నేను ఉన్న సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించారు. రాత్రి షూటింగ్‌లు నాకు అస్సలు అలవాడు లేదు. పైగా పగలు నాకు నిద్ర వచ్చేది కాదు. దీంతో రాత్రిళ్లు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తెల్లవారే మేల్కొని ఉండాల్సి వచ్చేది.
ఇది ఒకట్రెండు రోజులు కాదండోయ్ దాదాపు 30 రోజులు నా పరిస్థితి అలాగే ఉండేది. ఓ వైపు ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singarai) చేస్తూనే మిగతా సినిమాల షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. దీంతో విశ్రాంతి లేకుండా పని చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. అయితే ఒకరోజు షూటింగ్ సెట్‌కు మా చెల్లి పూజా కన్నన్(Pooja Kannan) వచ్చింది. ఇక తనతో మాట్లాడుకుంటూ ఏడ్చేశాను కన్నీళ్లు ఆగలేదు. ఒప్పుకున్న సినిమాలు చేయాలని ఉందని చెప్పాను. అలాగే ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందని నా బాధను నా చెల్లితో చెప్పుకున్నా’’ అని చెప్పుకొచ్చింది.