హజ్బెండ్ ఆఫ్ ది ఇయర్.. వెకేషన్‌కు వైఫ్ ప్లేస్‌లో దిండు

by Nagaya |
హజ్బెండ్ ఆఫ్ ది ఇయర్.. వెకేషన్‌కు వైఫ్ ప్లేస్‌లో దిండు
X

దిశ, ఫీచర్స్ : ఒంటరిగా ప్రయాణించడం అనుకున్నంత సులభం కాదు. ఎవరో ఒకరు తోడుంటే తప్ప ఏ ప్రయాణమైనా ఆనందకరంగా మారదు. అందులోనూ అమితంగా ఇష్టపడే వారితో జర్నీ చేయడంలో తెలియని బ్యూటీ దాగుంది. ఇలానే ఒక వ్యక్తి తన భార్యతో వెకేషన్‌ ప్లాన్ చేయగా.. ఆమె చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. దీంతో టూర్‌లో ఆమె ప్రజెన్స్‌ను ఫీల్ అయ్యేందుకు అతడికి ఒక ఫన్నీ ఐడియా తట్టింది. వెంటనే దాన్ని అమలు చేయగా.. సదరు యూనిక్ థాట్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

ఫిలిప్పీన్స్‌కు చెందిన రేమండ్ ఫార్చునాడో.. పలావాన్‌లోని కోరోన్‌కు ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేశాడు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల అతని భార్య జోవాన్ ఫార్చునాడో వెకేషన్ ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో సింగిల్‌గా విహార యాత్రకు బయలుదేరిన రేమండ్.. భార్య జోవాన్ తనతోనే ఉండేలా ఓ ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె రూపం ముద్రించబడిన ఒక దిండును తోడుగా తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసిన రేమండ్.. దిండుతో స్నార్కెలింగ్ చేస్తున్న ఫొటోలు కూడా పంచుకున్నాడు. ఇక ఈ చిత్రాల పట్ల నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రేమండ్‌ను 'హజ్బెండ్ ఆఫ్ ది ఇయర్'గా పిలుస్తుండగా.. మరికొందరు దీనిని 'ఫన్నీ అండ్ బ్యూటిఫుల్‌ టూర్'గా పేర్కొంటున్నారు. ఇంకొందరైతే జోవాన్‌ను 'లక్కీ గర్ల్'గా పొగిడేస్తున్నారు.

Advertisement

Next Story