TG Assembly: హరీశ్‌రావ్.. సభలో ఇన్ని అబద్ధాలా : బాలూ నాయక్

by Shiva |
TG Assembly: హరీశ్‌రావ్.. సభలో ఇన్ని అబద్ధాలా : బాలూ నాయక్
X

దిశ, వెబ్‌‌డెస్క్: పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన హరీశ్ రావు (Harish Rao) సభలో ఇన్ని అబద్ధాలు మాట్లాడుతారని అనుకోలేదని ఎమ్మెల్యే బాలూ నాయక్ (MLA Balu Nayak) కామెంట్ చేశారు. ఇవాళ ఆయన బడ్జెట్‌పై సభలో మాట్లాడుతూ.. హరీశ్ రావు ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని అన్నారు. గతంలో ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు పాలన అంటే అని మండిపడ్డారు. పరీక్ష పేపర్ల లీకేజీతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (Public Service Commission)ను అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు పాలన అంటే అని సెటైర్లు వేశారు. పరివారానికి, సంతానానికి, లిక్కర్ స్కాముల విద్యా నేర్పండం కాదు.. పారిపాలన అంటే అని దుయ్యబట్టారు.

పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో మహిళలను మీటింగ్‌లకు వాడుకోవడం తప్ప వారిని వృద్ధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేయలేదని అన్నారు. ఆర్టీసీ (RTC) సిబ్బంది నిరసనలు తెలిపితే ఉద్యోగాలను తొలగించారని ఫైర్ అయ్యారు. పండుగలకు పంపిణీ చేసిన చీరలు పొలాలకు పరదాలు అయ్యాయని అన్నారు. నాణ్యత లేని చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానపరిచారని కామెంట్ చేశారు. యూపీఏ ప్రభుత్వ (UPA Government) హయాంలో రూ.400 లకే గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పంపణీ జరిగిందని గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.1,250 చేశామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చాక రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని అన్నారు. కానీ, హరీశ్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బాలూనాయక్ అన్నారు.

Next Story