విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

by Aamani |
విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాలను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి కీలక సూచనలు చేశారు. పట్టణంలోని బాయ్స్ హై స్కూల్, దోమకొండ బాయ్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య ఉన్నారు.

Next Story

Most Viewed