- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Good Bad Ugly: అజిత్ సినిమాలో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. హైప్ పెంచేస్తున్న న్యూస్

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) త్వరలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. స్టార్ నటి త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అతిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ప్రెస్టేజీయస్ మూవీలో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగిబాబు, ఫైన్ టామ్ చాకో, రఘురామ్ తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రతి అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో స్టార్ నటుడు అర్జున్ దాస్ (Arjun Das) విలన్ పాత్రలో నటించబోతున్నారట. అలాగే ఇందులో ఒక పాత పాటను మళ్ళీ తెరపైకి తెస్తారని చెబుతున్నారు. అలాగే ఈ స్పెషల్ సాంగ్(Special Song)లో అర్జున్ దాస్‌తో కలిసి మలయాళ కుట్టి ప్రియాంక వారియర్ (Priyanka Warrior) డాన్స్ చేయనుందని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుండగా.. ‘అప్పుడే స్పెషల్ సాంగ్స్ అవసరమా’ అని అంటుంటే మరికొందరు మాత్రం ‘ప్రియా వారియర్ స్పెషల్ సాంగ్ చేస్తుందా.. వావ్ సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- It is said that an old song will be revived in the film.
— Movie Tamil (@MovieTamil4) March 31, 2025
- Thottu Thottu pesum Sultana song has been used in #GoodBadUgly.
- It is said that Arjun Das will play the antagonist in this film.
- #ArjunDas and the famous Malayalam actress #PriyaVarrier have also danced to this… pic.twitter.com/NVXw18WwnY