పాకిస్థాన్ సైన్యంలో ప్రకంపనలు.. 1450 సైనికులు రాజీనామా !

by Veldandi saikiran |   ( Updated:2025-04-28 03:47:24.0  )
పాకిస్థాన్ సైన్యంలో ప్రకంపనలు.. 1450 సైనికులు రాజీనామా !
X

దిశ వెబ్ డెస్క్ : ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ (Pakisthan)మధ్య వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ రెండు దేశాల్లోనూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ గజగజ వనికి పోతుంది. పహల్గాం సంఘటన నేపథ్యంలో... ఇండియా ఎలాగైనా పతికార చర్య తీసుకుంటుందని... బార్డర్ వద్ద పాకిస్తాన్ అలర్ట్ అయింది. దీంతో ఇండియా , పాకిస్తాన్ బార్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది.

ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి ( Pakistani Army) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలకంగా పనిచేస్తున్న 1450 మంది రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన న్యూస్... నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియాతో యుద్ధం అంటేనే పాకిస్తాన్ ఆర్మీ వణికి చెబుతున్నారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 1200 మంది సైనికులు... తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గాను రాజీనామా చేశారట.

అలాగే 250 మంది ఆర్మీ ఉన్నతాధికారులు కూడా.... తమ పదవులకు రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. బతికి ఉంటే పల్లి బఠానీ తిని, ఉండవచ్చు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఆర్మీ ని వదిలేస్తున్నారట సైనికులు. ఇండియాతో యుద్ధంలో పాల్గొంటే కచ్చితంగా చనిపోవడం గ్యారంటీ అని డిసైడ్ అయ్యారట సైనికులు. అందుకే ఒక్కొక్కరిగా పాకిస్తాన్ ఆర్మీని వదిలి వెళ్ళిపోతున్నారు సైనికులు. దీంతో పాకిస్తాన్ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.


Click For Tweet..


Next Story