- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నందమూరి హీరో

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) 2023లో ‘అమిగోస్’ సినిమాతో వచ్చి డిజాస్టర్‌ను చవిచూశారు. ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్రకటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు. ప్రజెంట్ కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) కాంబినేషన్‌లో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi)మూవీ రాబోతుంది. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanti), సోహెల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇందులో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. కళ్యాణ్ రామ్ అమ్మ అంటే ప్రాణం ఇచ్చే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తే అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, రంజాన్ పండుగ సందర్భంగా చిత్రబృందం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘నయాల్ది’అని సాగే ఈ పాటలో కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టారు. జాతరలో హీరోయిన్ సాంప్రదాయ లుక్‌లో నడిచి వస్తుండగా.. కళ్యాణ్ రామ్ పాడిన లిరిక్స్ అందరినీ ఫిదా చేస్తున్నారు. ఇక ఆయన చేసిన స్టెప్స్ దుమ్మురేపుతున్నాయి.