- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నేను అలాంటిదాన్ని కాదు.. ప్లీజ్ నన్ను నమ్మండి'
దిశ, వెబ్ డెస్క్: అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని శివాజీనగర్ లో భార్యాభర్తలు నివాసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇన్నాళ్లపాటు సంతోషంగా ఉన్న అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో అతను ఆమెను ప్రతిరోజూ వేధించసాగాడు. ప్రతిరోజూ ఎవరితో మాట్లాడుతున్నావంటూ వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యేవి. 'నేను అలాంటిదాన్ని కాదు.. నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు.. నన్ను నమ్మండి. మీకు నచ్చకపోతే విడాకులు ఇయ్యండి. అంతేకానీ, ప్రతిరోజూ నన్ను వేధించొద్దు' అని ఆమె వేడుకుంది. అయినా కూడా అతని మనసు కరగలేదు. బెల్ట్ తో భార్య గొంతునులిమి హత్య చేశాడు. ఆ సమయంలో భార్య అరవడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అప్పటికే చనిపోయింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.