జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ అలెర్ట్

by Harish |
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ అలెర్ట్
X

టోక్యో: జపాన్ లోని ఫకుషిమా రీజియన్‌లో తీరానికి దూరంగా భారీ భూకంపం సంభవించింది. జపాన్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.36 నిమిషాలకు సంభవించిన ఈ భారీ భూకంపంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఫకుషిమా రీజియన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోతున చెలరేగిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.3 గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ భూకంపం వల్ల జపాన్‌లోని 20 లక్షల గృహాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. టోక్యో నగరంలోనే 7 లక్షల గృహాలకు విద్యుత్ కట్ అయిందని విద్యుత్ సంస్థ టెప్ కో చెప్పింది. 11 సంవత్సరాల క్రితం రిక్టర్ స్కేలుపై 9.0తో విరుచుకుపడిన భారీ భూకంపం ఫకుషిమాలోని న్యూక్లియర్ ప్లాంట్‌ను ధ్వంసం చేసింది.

కాగా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతంలోని మియాగిలో ఉన్న అణుకేంద్రం దెబ్బతిన్నట్లు సమాచారం లేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ పేర్కొంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగమై ఉన్న జపాన్ తరచుగా భూకంపాల బారిన పడటం తెలిసిందే.

Advertisement

Next Story