ధనురాసనం వేయు పద్ధతి.. వారు వేయకూడదు

by Javid Pasha |   ( Updated:2022-03-09 04:29:21.0  )
ధనురాసనం వేయు పద్ధతి.. వారు వేయకూడదు
X

దిశ, ఫ్యూచర్: ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వీరిలో చాలా మంది తమ ఆరోగ్యం కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అయితే యోగాలో ప్రముఖ ధనురాసనం ఎలా వేయాలి, ఆసనం వేసే సమయంలో ఎలాంటి జాత్రత్తలు తీసుకోవాలి, ఎవరు ఈ ఆసనం వేయకూడదని తెలుకుందాం రండి.. చదునైన నేలపై బోర్లా పడుకుని తల, మెడ, ఛాతి, తొడలు, మోకాళ్లను ఒకేసారి వెనక్కి లేపాలి. మోకాళ్లు, పాదాలు దగ్గరగా ఉంచి పైకి చూడాలి. శరీరమంతా నాభిపై సమతుల్యంగా ఉండేలా చేస్తూ నెమ్మదిగా చేతులతో కాలి బొటన వేళ్లను లాగుతూ శరీరాన్ని విల్లు రూపంలోకి తీసుకురావాలి. ఈ దశలో కనీసం 5 సెకన్ల పాటు గాలి పీల్చుతూ అలాగే ఉండాలి. కష్టంగా అనిపిస్తే గాలి వదులుతూ ఆసనం నుంచి బయటకు రావాలి.

ఉపయోగాలు:

ఈ ఆసనం శరీరానికంతటికి శక్తి, బలాన్ని ఇస్తుంది. శరీర అంతర్భాగాలకు బలం చేకూరుతుంది. మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఉత్తేజమవుతాయి.

జాగ్రత్తలు:

హరేనియా, పెద్దప్రేగు, పొట్ట అల్సర్లు, గుండె జబ్బు, రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయరాదు.

Advertisement

Next Story

Most Viewed