Honda Activa EV: మార్కెట్‌లోకి హోండా యాక్టివా ఈవీ.. 100 శాతం బ్యాటరీ ఛార్జ్‌‌తో..!

by Anjali |
Honda Activa EV: మార్కెట్‌లోకి హోండా యాక్టివా ఈవీ.. 100 శాతం బ్యాటరీ ఛార్జ్‌‌తో..!
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబరు(November) 27 వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. హోండా యాక్టివా స్కూటర్(Honda Activa Scooter). 100 శాతం బ్యాటరీ ఛార్జ్(Battery charge)తో ఈ హోండా యాక్టివా ఈవీ స్టాండర్డ్ మోడ్(EV standard mode)​లో 104 కిలోమీటర్ల రేంజ్(Kilometer range)​‌ను ఇస్తుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా మెరుగైన థ్రోటిల్ రెస్పాన్స్(Throttle response) కోసం ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్పోర్ట్ మోడ్​ కూడా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు విభిన్న రకాల డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్(Digital instrument cluster)​ని పొందుతుంది. హై ట్రిమ్ లెవల్ మల్టీ కలర్ స్క్రీన్(High trim level multi color screen)​ని కలిగి ఉంటుంది. రేంజ్ లెఫ్ట్(Range Lieut), స్పీడ్(Speed), పెద్ద స్క్రీన్(Big screen)​లో బ్యాటరీ ఛార్జర్(Battery charger), మోడ్ వంటితో వస్తుంది.

స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటారు(Swing arm mounted motor)ను బట్టి, హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్(Electric scooter) ధర ప్రత్యర్థులతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్(Ola Electric), బజాజ్(Bajaj), టీవీఎస్(TVS) నేతృత్వంలోని మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సెగ్మెంట్​పై కంపెనీ కన్నేసింది. దేశవ్యాప్తంగా లభ్యత పరంగా ఈ బ్రాండ్ తన స్కూటర్లను ఎంత త్వరగా డెలివరీలు ఆసక్తికరంగా మారింది. మునుపటి టీజర్లలో ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్(LED head lamp,), కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Electric scooter)​లోని సీటు గ్లింప్స్​ని చూపించింది. ఫీచర్లపై వివరాలు అంతగా క్లారిటీ లేదు.

Advertisement

Next Story