మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం : హోంమంత్రి సుచరిత

by Nagaya |
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం : హోంమంత్రి సుచరిత
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధానిపై తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. గతంలో తమ ప్రభుత్వం చెప్పినట్లు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం, రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పినట్లు గుర్తు చేశారు. రాజధాని మెుత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని సుచరిత వివరించారు.

Advertisement

Next Story