ఉక్రెయిన్‌కు మద్ధతుగా హాలీవుడ్ స్టార్.. విరాళంగా మిలియన్ డాలర్లు

by Harish |
ఉక్రెయిన్‌కు మద్ధతుగా హాలీవుడ్ స్టార్.. విరాళంగా మిలియన్ డాలర్లు
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాడు. రష్యన్ల దాడితో భారీగా నష్టపోతున్న ఉక్రెయిన్‌కు డికాప్రియో 10 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చినట్లు ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే తన సహాయానికి ఓ బలమైన కారణం ఉందన్న డికాప్రియో.. తన అమ్మమ్మ 'హెలెన్ ఇండెన్‌బిర్కెన్' ఒడెస్సాలోని జెలెనా స్టెపనోవాలో జన్మించినట్లు చెప్పాడు. అయితే 1917లో తన తల్లి జన్మించిన తర్వాత కుటుంబ అవసరాల రీత్యా ఆమె జర్మనీకి వలస వెళ్లినట్లు తెలిపిన ఆయన.. ఈ ఆర్థిక సాయం గురించి ప్రపంచానికి తెలియజేయడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు సదరు మీడియా తెలిపింది.

Advertisement

Next Story