అధిక కొలెస్ట్రాల్‌తో హార్ట్‌కే కాదు.. ఈ అవయవాలకు కూడా ముప్పే..?

by Anjali |   ( Updated:2024-10-22 10:29:30.0  )
అధిక కొలెస్ట్రాల్‌తో హార్ట్‌కే కాదు.. ఈ అవయవాలకు కూడా ముప్పే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ ( Cholesterol ) సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కారణంగా గుండె జబ్బులు(Heart diseases ), హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ అనేది మైనపు, కొవ్వు పదార్ధం. ఇది మానవ శరీరంలోని అన్ని కణాల్లో ఉంటుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించి జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

అధిక కొెలెస్ట్రాల్ గుండెకే కాదు..

ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల్లో ఛాతి నొప్పి (Chest pain) , శ్వాస ఆడకపోవడం, గుండెదడ, హార్ట్ కు సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ కారణంగా కేవలం గుండెకే కాదు.. పలు అవయవాలకు కూడా ముప్పే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రక్తనాళాలు గడ్డకట్టే అవకాశం..

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక దష్ప్రభావాలు కలుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల ఫలకం చేరి.. ధమనులు ఇరుకైన లేదా నిరోధించడానికి కారణమవుతాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్(Blood circulation )కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో గుండె సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఛాతీలో నొప్పి, తీవ్రమైన మంట వస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి. తద్వారా రక్తపోటు వస్తుంది. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది..

అధిక కొలెస్ట్రాల్ కారణంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ రక్త నాళాలను ప్రభావితం చేయడమే కాకుండా.. మెదడుకు దారితీసే పలు ధమనులను కూడా పాడుచేస్తాయి. మధుమేహం ఉన్నవారిలో కూడా ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బుల్ని తెచ్చే ప్రమాదం ఉంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

తప్పకుండా మీ డైట్‌లో ఒమేగా- త్రీ ఉండాలి..

కాగా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఈ టిప్స్ పాటిస్తే సులభంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఆరోగ్యకరమైన క్రొవ్వులను ఎంచుకోవాలి. ఆహారంలో కచ్చితంగా ఒమెగా -3 ఉండాలి. ఎక్కువగా నీటిలో కరిగే ఫైబర్లను తీసుకుంటే బెటర్. శరీర బరువును బ్యాలన్స్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed