Hero Srikanth: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ

by GSrikanth |   ( Updated:2022-06-27 09:58:18.0  )
Hero Srikanths Family Visit Tirumala Temple
X

దిశ, ఏపీ బ్యూరో : Hero Srikanth's Family Visit Tirumala Temple| సినీనటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమ పెట్టి పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు. రోషన్‌తో పాటు తల్లి ఊహ, తమ్ముడు రోహన్, చెల్లెలు మేధ ఉన్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన వీరితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరోవైపు ఎరుపురంగు లంగావోణీలో మేధ ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు.


Also Read: చార్మీతో ఎఫైర్.. బండ్ల గణేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పూరి జగన్నాథ్

Advertisement

Next Story