- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్సాఫ్ ట్రాఫిక్ ఎస్సై..
దిశ, బేగంపేట : మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ ఎస్సై.. తనకు రోడ్డుపై దొరికిన 25 గ్రాముల బంగారు బ్రాస్లెట్ ను పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అందించారు. వివరాలలోకి వెళితే... ఎస్పీ రోడ్ లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలోని తక్షశిల అపార్ట్మెంట్‌లో వ్యాపారి అజిత్ బొహ్రా నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన వైఎంసీఏ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ప్యాట్నీ సెంటర్‌లో సిగ్నల్ వద్ద ప్రమాదవశాత్తు మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఆ వ్యాపారి కింద పడిపోయాడు. ఈ సమయంలో ఆయన కుడిచేతికి ఉండే 25 గ్రాముల బంగారు బ్రాస్లెట్ అక్కడ పారుతున్న మురుగు నీళ్ళలో పడిపోయింది. దాన్ని గమనించని ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
అక్కడే విధి నిర్వహణలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై పోతుల శ్రీధర్ కు బ్రాస్లెట్ కనిపించింది. దాన్ని తీసుకొని శుభ్రం చేసి పరీక్షించగా అది బంగారు బ్రాస్లెట్ గా గుర్తించారు. అరగంట ముందు చిన్న ప్రమాదం జరిగిన వాహనదారులది అయి ఉండవచ్చని బావించి.. సీసీ కెమెరాలు పరిశీలించారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించారు. అప్పటికే ఆ వ్యాపారి ఇంట్లో, చుట్టుపక్కల పోగొట్టుకున్న బ్రాస్లెట్ కోసం వెతుకుతున్నాడు. పోలీసుల సమాచారం తో ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ బ్రాస్లెట్ తనదేనని ఆధారాలు చూపించాడు. దీంతో సదరు పోలీసు ఆ వ్యాపారికి ఆ బ్రాస్లెట్ అప్పగించారు. అనంతరం ఎస్సై శ్రీధర్ ను ఇన్స్పెక్టర్ సత్తయ్య అభినందించారు.