- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా కౌంటర్ ఇచ్చారు. పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్‌వి పరిణితి లేని వ్యాఖ్యలని ఎద్దేశా చేశారు. నిరుద్యోగుల కోసం డీఎస్సీ వాయిదా కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ గతం మరిచిపోయినట్లు ఉన్నారని, గతంలో ఆయన గ్రూప్-2, టెట్ వాయిదాకు మద్దతు తెలపలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాటనా అని అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేస్తోందో బీఆర్ఎస్ కాదని.. వాళ్ల జీవితాలతో ఆడుకుంటోంది మీరేనని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా పరీక్షలు వాయిదా వేయాలని కోరారని, మరీ అప్పుడు వాళ్లు కూడా రాజకీయం కోసమే పోస్ట్‌పోన్ చేయాలని డిమాండ్ చేశారా అని నిలదీశారు.