- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో ఏడ్చేసిన వరుడు.. Viral Video
దిశ, వెబ్ డెస్క్: పెళ్లంటే నూరేళ్ళ పంట అని పెద్దలంతా చెబుతుంటారు. అంతేకాకుండా జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే పెళ్లిని అందరూ అంగరంగవైభంగా చేసుకోవాలని ఆలోచిస్తారు. అయితే పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. ఎన్నో మనోభావాలన సమ్మెళనం అని ప్రతి పెళ్లి నిరూపిస్తోంది. పెళ్లిలో అనేక కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు జరుగుతుంటాయి. అయితే వీటన్నింటిని మిస్ కాకుండా క్యాప్చర్ చేసే వాళ్లే స్నేహితులు. ఎవరి కంటికి చిక్కని సన్నివేశాలు కూడా స్నేహితుల ఫోన్ కెమెరాలకు చిక్కేస్తుంటాయి. అయితే తాజాగా ఓ పెళ్లికి సంబంధించి స్నేహితులు క్రియేట్ చేసిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లే ముందు అమ్మాయి ఏడుస్తుంది.
కానీ తాజాగా వైరల్ అయిన వీడియోలో పెళ్లి కొడుకు పెళ్లి పీటలపైనే ఏడుస్తూ కనిపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో ఆనందంగా ఉండాల్సిన అబ్బాయి ఏడుస్తున్న వీడియోను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తే.. పెళ్లి కూతురు కోపంగా చూడడంతో పెళ్లి కొడుకు ఏడుస్తున్నట్లు ఉంటుంది. వెంటనే ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు. చివరకు అమ్మాయికి ముద్దు పెడుతున్నట్లు కనిపిస్తుంది. పెళ్లి కొడుకు ఏడుస్తున్నట్లు చేసి, నవ్వుతూ సరదాగా తీసిన వీడియో ఇంస్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.