సంస్కృతికి నెల‌వు ఓరుగ‌ల్లు.. హన్మకొండ వేడుకల్లో గవర్నర్

by Javid Pasha |
సంస్కృతికి నెల‌వు ఓరుగ‌ల్లు.. హన్మకొండ వేడుకల్లో గవర్నర్
X

దిశ‌ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : చారిత్రక, సంస్కృతీ సంప్రదాయాలకు నెల‌వు ఓరుగ‌ల్లు అని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం 2022 వేడుక‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం ఘనంగా ప్రారంభమాయ్యాయి. రాష్ట్ర‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఈ వేడుక‌ల‌ను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛ‌నంగా ఈ వేడుక‌ల‌ను ప్రారంభించారు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం 2022లో స్థానిక కళాకారులచే వైవిధ్యభరితమైన కళా ప్రదర్శనలు మరియు జానపద నృత్యరూపాలతో వేదికపై, ప్రేక్షకుల నడుమ వేడుకలు కన్నుల పండుగగా జరిగింది.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు ఇతర దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం, ప్రోత్సహించడం అనే అంశాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాల‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడు జోనల్ కల్చరల్ సెంటర్‌లను ( జ‌డ్ సీసీలు) పాటియాలా, నాగ్‌పూర్, ఉదయపూర్, ప్రయాగ్‌రాజ్, కోల్‌కతా, దిమాపూర్ మరియు తంజావూరులో ప్రధాన కార్యాలయాలతో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వివిధ జానపద కళలు, నృత్యం, సంగీతం, హస్తకళలు మరియు సృజనాత్మక వ్యక్తీకరణ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ (ఆర్ ఎస్ ఎం)ని నిర్వహిస్తోంద‌ని తెలిపారు.


కళాకారులకు వారి కళ, కళాత్మకతను ప్రదర్శించడానికి ఇది చక్కని అవకాశం అని అన్నారు. కళాఖండాలు ఇతర సంప్రదాయ వస్తువుల విక్రయాల ద్వారా వారి జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. సంప్రదాయ ప్రదర్శన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒకే గొడుగు కిందకు తీసుకొని రావడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయాని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి సాంస్కృతిక సామరస్యానికి చిహ్నం అని అన్నారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం గురించి ప్రజలకు ముఖ్యంగా యువ తరానికి అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed