- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamilisai: నాకు రాష్ట్రపతి మద్దతు ఉంది.. గవర్నర్ అనూహ్య వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానని, ప్రజాసేవే తప్ప ప్రోటోకాల్ గురించి నేను పట్టించుకోనని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చామని, ఆ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గవర్నర్‌గా నా బాధ్యతలు నేను నిర్వహిస్తున్నాను. అందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. సీఎం నుంచి సర్పంచ్ వరకు ఎవరైనా వ్యవస్థలన్నీ అందరూ గౌరవించాలని సూచించారు. గతేడాది నుంచి ఒక్కరోజు సెలవు లేకుండా నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నాని అన్నారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రతినెలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారని, ధాన్యం కొనుగోలు అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లేఖ సంబంధిత వర్గాల పంపించానని స్పష్టం చేశారు. భద్రాచలం పర్యటన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని వాపోయారు. ఒక మహిళగా నేను స్ట్రాంగ్.. మహిళలు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి, నాకు రాష్ట్రపతి నుంచి మంచి మద్దతు ఉంది నేను బాగా పని చేస్తానని వాళ్లకు నమ్మకం ఉందని అన్నారు.
- Tags
- Tamilisai