వారు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

by Vinod kumar |
వారు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
X

దిశ, కామారెడ్డి రూరల్: దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో దళిత బంధు పై లబ్ధిదారులకు అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను ఎంచుకొని అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసమే ఈ పథకం అమల్లోకి తెచ్చారని చెప్పారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దళిత రక్షణ నిధి దళిత కుటుంబాలకు దోహదపడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లబ్ధిదారులు వివిధ రకాల యూనిట్లు ఎంచుకొని భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. అవగాహన సదస్సులో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసుకునే యూనిట్ల వివరాలను ఆయా శాఖల అధికారులు తెలియజేశారు. సదస్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే‌, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed