మా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

by Web Desk |
మా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు మంజూరైన రూ. 2 కోట్ల 32 లక్షల 26 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా నిధులు మంజూరు చేస్తూ.. పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీ మోహన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శ్రీకాంత్, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story