- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి: బీజేవైఎం
దిశ, మంచిర్యాల: పేద నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏఓ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ మాట్లాడుతూ.. బీజేవైఎం చేసిన పోరాటాలకు స్పందించిన ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిందని తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన యువత ఆర్థిక పరిస్థితుల వల్ల కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పరిస్థితి ఉన్నందున అలాంటి వారికి ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బోయిని దేవేందర్, జిల్లా కార్యదర్శి విజయ్ అంబాలా, జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, మంచిర్యాల అసెంబ్లీ కోకన్వీనర్ కుర్రే చక్రవర్తి, దండేపల్లి, చెన్నూర్ రూరల్ అధ్యక్షుడు కొఠారి వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి వల్లంబట్ల వంశీ, క్యాతన్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు సంతోష్, సాయి, వంశీ, వికాస్ ఆదర్శ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.