Google Mpas: గూగుల్ మ్యాప్‌లో 'టోల్ చార్జీ'ల ధర!

by Manoj |   ( Updated:2022-06-16 08:10:57.0  )
Google Maps will now show toll prices on selected routes in india
X

దిశ, ఫీచర్స్ : Google Maps will now show toll prices on selected routes in india| ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే భారతదేశంలోని వినియోగదారులు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లోని టోల్ ధరలను ముందే తెలుసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ యూఎస్ఏ, ఇండియా సహా ఇండోనేషియాలోని దాదాపు 2,000 టోల్ రోడ్‌లకు అందుబాటులోకి వస్తుంది.

వాహనదారులు వెళ్లే రోడ్డులో టోల్ చార్జీల రూపేనా చెల్లించాల్సిన మొత్తం ధరను అంచనా వేసేందుకు Google Maps స్థానిక అధికారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఇక టోల్‌ ధరల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్‌లో ఆరిజిన్, డెస్టినేషన్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన షార్ట్‌ కట్‌లతో పాటు ఎస్టిమేట్‌ టోల్‌ ధరలు డిస్‌ప్లే అవుతాయి. అంతేకాదు టోల్‌ చెల్లించకూడదనుకునే వారికి టోల్-ఫ్రీ మార్గంతో ప్రత్యామ్నాయ ఎంపికలను కూడా చూపుతుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత Google మ్యాప్స్‌లో పైన రైట్ కార్నర్‌లో ఉన్న మూడు చుక్కలపై నొక్కి, 'అవాయిడ్ టోల్స్' అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఈ సమాచారం పొందొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed