రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.10 చార్జీతో రైలు ప్రయాణం

by Nagaya |
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.10 చార్జీతో రైలు ప్రయాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మెమూ ప్యాసింజ‌ర్ రైళ్ల పున‌ఃప్రారంభం సంద‌ర్భంగా సికింద్రాబాద్ రీజియ‌న్ ప‌రిధిలో రైళ్లను తక్కువ చార్జీలతో న‌డ‌పాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా సికింద్రాబాద్‌-ఉందానగర్‌-మేడ్చల్‌ మ‌ధ్య ఈ రైళ్లను న‌డ‌ప‌నున్నారు. సికింద్రాబాద్‌- ఉందానగర్‌ మార్గాల్లో న‌డిచే మెమూ రైళ్లు.. సీతాఫ‌ల్ మండి, ఆర్ట్స్ కాలేజీ, జామై ఉస్మానియా, విద్యాన‌గ‌ర్, కాచిగూడ‌, మ‌ల‌క్‌పేట‌, డ‌బీర్ పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ‌, ఫ‌ల‌క్‌నూమా, శివ‌రాంప‌ల్లి, బుద్వేల్ స్టేష‌న్లలో ఆగ‌నున్నట్లు తెలిపారు.

ఉందానగర్‌ నుంచి మేడ్చల్‌ వెళ్లే మెమూ రైళ్లను.. బుద్వేల్‌, ఎన్‌పిఎ శివరాంపల్లి, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబిర్‌పురా, మలక్‌పేట, కాచిగూడ, విద్యానగర్‌, జామై ఉస్మానియా, ఆర్ట్స్‌ కాలేజీ, సీతాఫల్‌మండి, మల్కాజిగిరి, దయానంద్‌ నగర్‌, సఫిల్‌గూడ, రామకిష్టాపురం గేట్‌, అమ్ముగూడ, కల్వారి బ్యారక్స్‌, అల్వాల్‌, బొలారం బజార్‌, బొలారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లలో అగుతాయని తెలిపారు. మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య నడిచే రైళ్లు గౌడవల్లి, గుండ్ల పోచంపల్లి, బొలారం, బొలారం బజార్‌, అల్వాల్‌, కల్వారి బ్యారక్స్‌, అమ్ముగూడ, రామకిష్టాపురం గేట్‌, సఫిల్‌గూడ, దయానంద్‌ నగర్‌, మల్కాజిగిరి స్టేషన్లలో ఆగనున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంత ప్రయాణికులకు ఇతర రవాణాలతో పొల్చితే మెమూ రైలు సర్వీసుల ప్రయాణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్కువ ప్రయాణ సమయం తో పాటు మరింత సౌకర్యవంత ప్రయాణమని, ప్రధానంగా రోజువారీ ప్రయాణికులకు అనుకూలమైనదని తెలిపారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళలలో డిమాండ్‌కు తగ్గట్టుగా అనుకూల సమయాల్లో రైళ్ల సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు మార్గాల్లో న‌డిచే మెమూ రైళ్ల ఛార్జీల‌ను కనీస చార్జీ రూ10, గరిష్ట చార్జీ రూ 15గా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు టికెట్లను ప్రయాణికులు టికెట్‌ కౌంటర్లలో, డిజిటల్‌ విధానంలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed