గేమ్ ఛేంజర్‌ మూవీలోని సాంగ్‌కు రూ. 20 కోట్ల ఖర్చు..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వార్త..!

by Kavitha |   ( Updated:2024-10-18 08:28:35.0  )
గేమ్ ఛేంజర్‌ మూవీలోని సాంగ్‌కు రూ. 20 కోట్ల ఖర్చు..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వార్త..!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ కాగా.. అంజలీ(Anjali), సముద్రఖనీ(Samudhrakhani), ఎస్‌జే సూర్య(SJ Surya), శ్రీకాంత్(Srikanth), సునీల్(Sunil), జయరాం(Jayaram), నవీన్ చంద్ర(Naveen Chandra) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జేట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజ్(Dil Raju), శిరీష్(Shirish) నిర్మిస్తున్నారు. కాగా 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ మూవీను తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..?

తన సినిమాల్లోని సాంగ్స్‌కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం శంకర్ స్పెషాలిటీ అన్న సంగతి తెలిసిందే. కనువిందు చేసే సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో ప్రేక్షకుడిని మైమరిపించేందుకు ఆయన వెనకాడరు. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ మూవీలోని ఓ మెలోడి సాంగ్‌ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదిరిపోయే లొకేషన్స్‌లో కియారా, చరణ్ మధ్య సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed