- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆప్ సర్కార్ బంపరాఫర్.. రాజ్యసభకు భజ్జీ
చండీగఢ్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ నేరుగా రాజ్యసభకు వెళ్లనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. పంజాబ్‌లో కొత్తగా ఏర్పాటైన ఆప్ సర్కార్ భజ్జీకి రాజ్యసభ స్థానం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్పోర్ట్స్ యూనివర్శటీ బాధ్యతలను కూడా మాజీ క్రికెటర్‌కు అప్పగించనున్నట్టు సమాచారం.ఈ విషయంపై సీఎం భగవంత్ మాన్ కూడా సుముఖంగా ఉన్నారని, ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్‌కు ఐదు స్థానాలుండగా అందులో ఒకటి హర్భజన్‌కు కేటాయిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పంజాబ్ ఎన్నికలకు ముందు భజ్జీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆ టైంలో బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరతారని అంతా భావించారు. కానీ ఎందులోనూ చేరలేదు. తీరా రాష్ట్రంలో ఆప్ సర్కార్ రావడంతో సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి ముందు తన తల్లితో కలిసి దిగిన ఫొటోను హర్భజన్ షేర్ చేస్తూ అభినందనలు తెలిపాడు. దీంతో భజ్జీ చీపురు పార్టీలో చేరుతారని మరోసారి కథనాలు వెలువడ్డాయి. కాగా, హర్భజన్ సింగ్‌ను పెద్దల సభకు పంపాలని భావించిన ఆప్ సర్కార్ ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరిపిందని.. ఇందుకు భజ్జీ సుముఖంగా ఉండటంతో పంజాబ్ నుంచి ఆయన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.