మాజీ ఎంపీ కూతురి పబ్‌లో డ్రగ్స్ పార్టీ.. పోలీసుల అదుపులో మాజీ డీజీపీ కూతురు, సినీ నటి!

by GSrikanth |   ( Updated:2022-04-03 06:01:31.0  )
మాజీ ఎంపీ కూతురి పబ్‌లో డ్రగ్స్ పార్టీ.. పోలీసుల అదుపులో మాజీ డీజీపీ కూతురు, సినీ నటి!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్‌‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఫుడింగ్ మింక్ పబ్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌‌‌ను సీజ్ చేసి, తెల్లవారే వరకూ పోలీసులు సోదాలు చేశారు. పట్టుబడిన వారిలో మాజీ డీజీపీ కూతురు, టాలీవుడ్ ప్రముఖ హీరో తనయ, సీనియర్ నటుడి కుమార్తె, సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారికి సీరియస్ వార్నింగ్, కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. అనంతరం పబ్ నిర్వహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌ను తరలించారు.


శృంగారం చేస్తే ఇన్ని లాభాలా..? అవేంటో తెలిస్తే మీరు కూడా ప్రతిరోజూ..


అంతేగాక, హోటల్‌లో ఆరు గ్రాముల కొకైన్, భారీగా డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-3 విజేత, మరో ఇద్దరు టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం పబ్‌లో 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ రాడిసన్ బ్లూ హోటల్‌ మాజీ ఎంపీ కుమార్తెదిగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed