మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలా.. అయితే పర్స్‌ను ఇలా పెట్టుకోండి

by samatah |
మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలా.. అయితే పర్స్‌ను ఇలా పెట్టుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : కొంత మంది వాస్తుశాస్త్రం, జాతకాన్ని నమ్మరు. మరికొంత మంది ప్రతి నిమిషం జాతకం చూసుకుంటూ.. ఏ దిక్కున ప్రయాణం చేయాలి లాంటివి చాలా ఫాలో అవుతుంటారు. అయితే ఇంట్లో కొన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తే, లక్ష్మీ దేవి నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇంట్లోనే కాదండి, మనం రోజు వాడే పర్స్‌కు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని విధిగా పాటిచినట్లైతే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండి.. డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా చూస్తుందంట. ఇంతకీ ఆ నియమ నిబంధనలు ఎంటో తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరు పర్స్ విధిగా వాడుతుంటారు. అయితే పర్స్‌లో తాళం చెవి, చనిపోయిన బంధువలుల ఫొటోలు, బిల్లు చిట్టీలు ఉంచుకోకూడదంట. అలా ఉంచడం వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి.. అప్పులు పెరిగిపోతుంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందువలన సాధ్యమైనంత వరకు ఇలాంటి పొరపాట్లు చేయకపోవడమే బెటర్.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చిటికెడు బియ్యాన్ని పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు స్తబ్దుగా ఉంటుంది. దీనితో పాటు లక్ష్మి దేవి ఆశీస్సులు ఉంటాయట. అంతే కాకుండా పర్స్‌లో చిల్లర ఒకవైపు.. నోట్లు ఒకవైపు పెట్టుకోవడం లక్ష్మీదేవికి ఇష్టం అంట. చిల్లర, నోట్లు కలిపి ఉంచడం వలన లక్ష్మీ దేవికి కోపం వస్తుందంట, అందువలన త్వరగా వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు. మరి ఇంకెందుకు లేటు పర్స్‌ను సర్దండి.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి.

Advertisement

Next Story

Most Viewed