- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడియో బుక్స్ విభాగంలోకి అడుగు పెట్టిన Flipkart!
న్యూఢిల్లీ: Flipkart to Partner with Pocket FM to Enter Audiobooks Category| దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆడియోబుక్స్ విభాగంలోకి అడుగుపెట్టినట్టు వెల్లడించింది. ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'పాకెట్ ఎఫ్ఎమ్‌తో' భాగస్వామ్యం ద్వారా ఈ విభాగంలోకి ప్రవేశించామని, దీంతో 40 కోట్ల మంది వినియోగదారులకు లైసెన్స్ ఉన్న ఆడియో బుక్స్‌ను అందించనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఆడియోబుక్స్‌ను వినేవారు సుమారు 2.5 కోట్ల మంది ఉంటారని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేసింది. 2020లో కరోనా మహమ్మారి తర్వాత ఆడియోబుక్స్‌ను వినేవారు భారీ సంఖ్యలో పెరిగారని, పాకెట్ ఎఫ్ఎమ్‌తో ఒప్పందం వల్ల రచయితలతో పాటు స్థానికంగా కంటెంట్‌ను ఆశించే వినియోగదారులకు ప్రయోజనాలుంటాయని ఫ్లిప్‌కార్ట్ ఎఫ్ఎంసీజీ హెడ్ కాంచన్ మిశ్రా అన్నారు.
ఈ ఏడాది మార్చిలో అధికారికంగా ఆడియోబుక్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన పాకెట్ ఎఫ్ఎమ్ ప్రతి నెలా 1.20 లక్షల ఆడియోబుక్‌లను విక్రయిస్తోంది. కాగా, మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు ఇప్పటికే ఆడియోబుక్స్ ప్లాట్‌ఫామ్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ తాజా ఒప్పందంతో ఈ విభాగంలో పోటీనివ్వడమే కాకుండా దేశీయంగా ఈ విభాగంలో ఉన్న డిమాండ్‌ను దక్కించుకునేందుకు వీలవుతుందని ఫ్లిప్‌కార్ట్ అభిప్రాయపడుతోంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ పాకెట్ ఎఫ్ఎమ్ విడిగా తన సేవలను కొనసాగించనున్నట్టు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: 'ఆప్షన్స్ స్టోర్'ను ప్రారంభించిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
- Tags
- Flipkart