- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాస్ సిలిండర్ పేలి ఐదేళ్ల చిన్నారి మృతి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్‌లో ఓ ఇంట్లో సిలిండర్ పేలి చిన్నారి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. సారంగపూర్ డైరీ ఫాం వద్ద రాజస్థాన్‌కు చెందిన సునీల్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తుండగా అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో సునీల్‌కు సంబంధించిన ముగ్గురు పిల్లలు బబ్లూ(9), జగ్గు(4), నమ్కి(5) అనే పాప గాయపడ్డారు. వారిని రాత్రి స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అందరి కన్న చిన్నపాప మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనలో తల్లిదండ్రులు ఇద్దరు గాయాలు కాకుండా బయటపడడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రాజస్థాన్‌కు చెందిన సునీల్ కుటుంబంతో సహా డైరీ ఫాంలో అద్దెకు ఉంటూ నగరంలోని హైమద్ పూర కాలనీలో పాల వ్యాపారం నిర్వహిస్తాడని తెలిసింది. సంఘటన స్థలాన్ని 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు పరిశీలించి కేసు నమోదు చేశారు.