- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరెంట్స్ వద్దన్నా వినలేదు.. ఆత్మవిశ్వాసమే గెలిపించింది : సినీ శెట్టి
దిశ, సినిమా : 2022 మిస్ ఇండియా టైటిల్ గెలిచాక తనపై అంచనాలు పెరిగిపోయాయి అంటోంది 'సినీ శెట్టి'. అంతేకాదు ఈ రంగంలో ఎంట్రీకి తన పేరెంట్స్ ఇష్టపడలేదంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ప్రస్తుతం నా ప్రయాణం అద్భుతంగా కొనసాగుతోంది. అభిమానుల అంచనాలను అందుకోవాలంటే మిస్ వరల్డ్ కూడా గెలుచుకోవాలి' అని చెప్పింది. ఇక తనతో పోటీపడిన అమ్మాయిల్లోనూ ప్రత్యేకతలు ఉంటాయని తెలిపిన శెట్టి.. సౌత్, నార్త్ తేడా లేకుండా ఎవరైనా కిరీటాన్ని గెలుచుకోవచ్చని అభిప్రాయపడింది.
అలాగే తల్లిదండ్రులే తనకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్న బ్యూటీ.. స్టడీస్‌లోనూ ప్రతిభ కనబరచడంతో ఈ ఫీల్డ్‌లో అడుగుపెట్టేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపలేదని వెల్లడించింది. చిన్నప్పటి నుంచి ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రాను చూసి ఆ స్థాయికి ఎదగాలని కలలు కన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే కలల సాకారానికి ప్రతి అమ్మాయి కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించింది.