- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. కూతురిని గర్భవతి చేసిన మారు తండ్రి చివరకు..
దిశ, వెబ్‌డెస్క్ : దుండిగల్ పీఎస్ పరిధి మల్లంపేట్‌లో దారుణం జరిగింది. వావి వరసలు మరిచి ఓ మారు తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన సొంత కూతురిలా చూసుకోవాల్సిన ఓ తండ్రి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. మల్లంపేటలో ఓ మహిళ తన భర్త చనిపోవడంతో కూతురుతో జీవనం సాగిస్తుంది. అయితే ఆమెకు ఓ వ్యక్తి పరిచయం కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆవ్యక్తితో మహిళ పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే మహిళ కూతురిపై మారు తండ్రి కన్ను పడింది. దీంతో కుమార్తెను లోబర్చుకుని బాలికపై మారు తండ్రి పలుమార్లు ఆత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు బాలిక గర్భవతి కావడంతో ఆమెకు ఆర్ఎంపీ ద్వారా నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. అయితే బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విషయం తెలుసుకున్న తల్లి దుండిగల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.