National Herald Case: కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్.. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు

by Naresh |   ( Updated:2022-08-02 08:19:55.0  )
ED Raids at National Herald Office
X

దిశ, డైనమిక్ బ్యూరో: ED Raids at National Herald Office| హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. గత నెలలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీలను ఈడీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా నేడు నేషనల్ హెరాల్ట్ ప్రధాన కార్యాలయంతో సహా 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఈడీ అధికారులు ఐదు రోజుల పాటు 53 గంటలు విచారించారు. ఆ తర్వాత సోనియా గాంధీని మూడు రోజుల పాటు దాదాపు 10 గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అయితే దర్యాప్తు సంస్థల తీరుపై ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖను రాశాయి. ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని లేఖలో పేర్కొన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హెడ్ ఆఫీస్ లో ఈడీ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచడంపై కాంగ్రెస్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశం అయింది.

ఇది కూడా చదవండి: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఐటీ రైడ్స్..

Advertisement

Next Story

Most Viewed