Eatala Rajender: హాట్ టాపిక్‌గా కోమటిరెడ్డి వ్యవహారం.. సంచలనానికి తెరలేపిన ఈటల

by GSrikanth |   ( Updated:2022-07-25 08:41:25.0  )
Eatala Rajender says, he Invites Komatireddy Rajagopal Reddy into BJP
X

దిశ, వెబ్‌డెస్క్: Eatala Rajender says, he Invites Komatireddy Rajagopal Reddy into BJP| మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై బీజేపీ కీలక నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఢీకొని, కేసీఆర్‌ను గద్దె దించే దమ్ము బీజేపీకే ఉందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో సాధరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

కాగా, గతంలో రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఆనాడే బీజేపీలో చేరుతాడని ప్రధాన పత్రికలు అన్నింట్లో వార్తలు వచ్చాయి. అనంతరం కొంత కాలం తర్వాత తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తాను పార్టీ మారడం చారిత్రక అవసరమని, టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలోకే వెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేయడం అటు కాంగ్రెస్ కార్యకర్తల్లో, ఇటు ఆయన అనుచరుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అసలు రాజగోపాల్ రెడ్డి మనసులో ఏముందో తెలియట్లేదని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవేళ బీజేపీలో చేరితే మాత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ పుంజుకుంటుందనంలో ఎలాంటి సందేహం లేదు.

ఇది కూడా చదవండి: ఏపీకి తలనొప్పిగా మారిన ఐదు గ్రామ పంచాయతీలు..

Advertisement

Next Story