- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటి.. ధర ఎంతంటే!
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటి గురువారం తన కొత్త మోటార్‌సైకిల్ స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రోను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 12,89,000 . ఎయిర్-కూల్డ్ ట్విన్-సిలిండర్ ఇంజన్ మొట్టమొదట 1971లో Ducati 750 GTలో కనిపించింది. ఇప్పుడు, 50 సంవత్సరాల తర్వాత దాని వారసత్వానికి నివాళులర్పించేందుకు రూపొందించబడిన ఒక ప్రత్యేక మోటార్‌సైకిల్ ఇది.
ఇంజిన్ డెస్మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ కూలింగ్‌తో 1079 cc L-ట్విన్, 7,500 rpm వద్ద 86 hp, 4,750 rpm వద్ద 9.2 kgm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్‌సైకిల్ పెద్ద 15-లీటర్ స్టీల్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ సీటుతో వస్తుంది. ఇది బ్రౌన్ సీటుతో పాటు బ్లాక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.
"స్క్రాంబ్లర్ డుకాటి 1100 ట్రిబ్యూట్ ప్రో అనేది మోడరన్-క్లాసిక్ బైక్‌లను ఇష్టపడే వారి కోసం, డుకాటి సాధించిన ముఖ్యమైన ఫీట్‌ల గురించి తెలిసిన అభిమానుల కోసం రూపొందించబడిన మోటార్‌సైకిల్" అని డుకాటీ ఇండియా ట్వీట్ చేసింది. ఈ సంవత్సరం మొదటి లాంచ్, స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ PRO ఐకానిక్ ఎయిర్ కూల్డ్ L-ట్విన్ ఇంజన్ ప్రత్యేక ఎడిషన్‌లో వినియోగదారులకు చేరడం గొప్ప విషయం అని డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు.
Marking a new chapter, the Scrambler Ducati 1100 Tribute PRO is a motorcycle created for lovers of modern-classic bikes and for fans of motorcycle history who are aware of the most important feats achieved by Ducati.#Ducati #ScramblerDucati #1100TributePRO #MarkYourRoots pic.twitter.com/kavulRIQ8F
— Ducati India (@Ducati_India) March 10, 2022