Thandel: ‘తండేల్’ మూవీ బుజ్జి తల్లి సాంగ్ లీక్ చేసిన డీఎస్పీ.. ఆకట్టుకుంటున్న లిరిక్స్ (వీడియో)

by Hamsa |
Thandel: ‘తండేల్’ మూవీ బుజ్జి తల్లి సాంగ్ లీక్ చేసిన డీఎస్పీ.. ఆకట్టుకుంటున్న లిరిక్స్ (వీడియో)
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). ఈ చిత్రానికి చందూ మొండేటీ దర్శకత్వం వహించారు. దీనిని గీతా ఆర్ట్స్‌‌ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Arvind) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘తండేల్’(Thandel) చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ఈ సినిమా నుంచి ‘బుజ్జి తల్లి’(Bujji Thalli) సాంగ్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్నారు.

దీంతో అక్కినేని నాగచైతన్య అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసి సాంగ్ లిరిక్స్‌ను లీక్ చేశారు. ఆయన కీబోర్డు ప్లే చేస్తుండగా.. జావేద్ అలీ(Javed Ali) పాట పాడుతూ కనిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘బుజ్జి తల్లి’(Bujji Thalli) ఫుల్ సాంగ్ నవంబర్ 21న సాయంత్రం 4.05 గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రజెంట్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Next Story