- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణీ స్త్రీలు నిరభ్యంతరంగా కాఫీ తాగొచ్చు : క్వీన్స్‌లాండ్ సైంటిస్ట్స్
దిశ, ఫీచర్స్ : ఆహారం తినకపోయినా సరే 'కాఫీ' లేదా 'టీ' తాగకపోతే మాత్రం కొందరికి ప్రాణం కుదుటపడదంటే అతిశయోక్తి కాదు. అంతగా టీ, కాఫీలకు అడిక్ట్ అయిపోయిన మనకు దానివల్ల లాభమా, నష్టమా తెలుసుకునేందుకు పరిశోధకులు ఇప్పటికే బోలెడు అధ్యయనాలు చేశారు. అయితే కాఫీలోని కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదంటూ కొన్ని పరిశోధనలు వెల్లడించినా.. ఇదే కాఫీ ఆయుష్షు పెంచుతుందని, మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని మరికొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఇక గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వల్ల గర్భస్రావం జరుగుతుందని, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టే ప్రమాదం ఉందని భయపడుతుంటారు. కానీ ఇలాంటి ప్రమాదాలు ఏమీ లేవని.. నిరభ్యంతరంగా కాఫీ తాగొచ్చని తాజా పరిశోధన వెల్లడించింది.
మహిళలు గర్భం దాల్చాక 'కాఫీ'లు తాగడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ధూమపానం, అల్కహాల్, పూర్ డైట్‌లానే కాఫీ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్‌పై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో నిజంగా కాఫీ ప్రతికూల గర్భధారణ ప్రమాదాన్ని పెంచుతుందా అని క్వీన్స్‌లాండ్‌కు చెందిన పరిశోధకుల బృందం తెలుసుకోవాలనుకుంది. ఈ మేరకు పరిశోధకులు మెండెలియన్ రాండమైజేషన్ అనే పద్ధతిని ఉపయోగించగా, గర్భిణీ స్త్రీలు కాఫీ తాగే ప్రవర్తనను అంచనా వేసే ఎనిమిది జన్యు వైవిధ్యాలను పరిశీలించారు. ఈ వైవిధ్యాలు సంతానంపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో అధ్యయనం చేశారు. మొత్తానికి గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. అంతేకాదు రోజుకు 300 mg కంటే తక్కువ కెఫిన్ (రెండు నుంచి మూడు కప్పులు) తాగాలని WHO మార్గదర్శకాలను కూడా పరిశోధకులు ప్రస్తావించారు. అంతేకాదు గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం వంటి ప్రమాదం లేదని కూడా తేల్చిచెప్పింది. ఈ అధ్యయన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో తాజాగా ప్రచురితమయ్యాయి.