Sweet with Bread: దీపావళికి బ్రెడ్‌తో షాహీ తుక్డా స్వీట్ తయారు చేయండి.. మీ అతిథులకు తప్పకుండా నచ్చుతుంది!!

by Anjali |   ( Updated:2024-10-24 15:43:08.0  )
Sweet with Bread: దీపావళికి బ్రెడ్‌తో షాహీ తుక్డా స్వీట్ తయారు చేయండి.. మీ అతిథులకు తప్పకుండా నచ్చుతుంది!!
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ. కాగా ఈ ఫేస్టివల్‌కు చాలా మంది స్వీట్స్ చేస్తారు. ఎన్నో రకాల స్వీట్లు చేసి బంధువుల నోరు తీపి చేస్తారు. మరికొంతమంది మార్కెట్‌లో స్వీట్లు కొనుగోలు చేస్తారు. మార్కెట్‌లో స్వీట్లు కొనే బదులు ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ తో టేస్టీ డెజర్ట్ షాహీ తుక్డా స్వీట్() తయారు చేయండి. రుచి అదిరిపోతుంది. అందరికీ బాగా నచ్చుతుంది. బ్రెడ్ తో తయారు చేసే ఈ రాయల్ స్వీట్ తయారీ విధానం ఏలాగో చూద్దాం..

బ్రెడ్ స్వీట్ షాహీ తుక్డా రెసిపీకి కావల్సిన పదార్థాలు..

బ్రెడ్ ముక్కలు-4, ఒక స్పూను పిస్తా తరుగు, నెయ్యి- 4 స్ఫూన్లు,జీడిపప్పు, బాదం- ఒక స్ఫూను, ఫుల్ క్రీమ్ మిల్క్- 2 కప్పులు, యాలకుల పొడి- అరస్ఫూను, పంచదార తీసుకోవాలి.

తయారీ విధానం..

ముందుగా కడాయి తీసుకుని.. బ్రెడ్ ముక్కల్ని వేయించాలి. మరో గిన్నె తీసుకుని పాలు పోసి అవి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. అందులో యాలకుల పొడి, పంచదార, కుంకుమ పువ్వు వేసి కలపాలి. తర్వాత వెడల్పు గల పాత్ర ఒకటి తీసుకుని బ్రెడ్ ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ముందు తయారు చేసిన మిశ్రమాన్ని ఈ బ్రెడ్ ముక్కలపై పోయాలి. ఇప్పుడు జీడిపప్పు, పిస్తా తరుగు, బాదం తరుగు దాని మీద చల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన టేస్టీ షాహీ తుక్డా తయారు అయినట్లే. ఈ స్వీట్ మీ అతిథులందరికీ బాగా నచ్చుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed