- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోను ఆకర్షించిన DJ టిల్లు.. ఆహాలో సూపర్ హిట్
దిశ, వెబ్‌డెస్క్ : యూత్‌ను ఎంతో ఆకర్షించిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమాలోని సన్నివేశాలు, కామెడీ సీన్లు సినిమాకు మంచి ఊపుతీసుకచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఈ సినిమాలోని డైలాగ్‌లు ఆకర్షించాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ల భాగంగా ఓ ఇంటర్వూలో డీజే టిల్లు సినిమాలోని కొన్ని డైలాగ్‌లను కోట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలోని ఊహించని ట్విస్ట్‌లు, కామెడీ సన్నివేశాలు, లాంగ్వేజ్ ఇటు బాక్స్ ఆఫీసు, అటు ఆహా ప్లాట్‌ఫామ్‌లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆహా సబ్‌స్క్రైబర్‌లలో, ముఖ్యంగా యువతలో ఈ చిత్రానికి చాలా డిమాండ్ ఉంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లతో పాటు ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, ధీరజ్ మొగిలినేని ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు.