Dil Raju: టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు బంద్.. దిల్ రాజు క్లారిటీ

by Satheesh |   ( Updated:2022-07-18 11:47:42.0  )
Dil Raju Gives Clarity On Suspension of Telugu Film Shooting
X

దిశ, వెబ్‌డెస్క్: Dil Raju Gives Clarity On Suspension of Telugu Film Shooting| గతకొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించాలని ప్రొడ్యూసర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకూ సినిమాకు ఖర్చు చేసేది ఎక్కువ అవుతుంది కానీ, తగ్గకపోవడంతో సినిమా షూటింగ్స్ బంద్‌పై అగ్ర నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో థియేటర్లలో విడుదలైన సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేదని, కానీ, నేడు పది రోజులు కూడా ఆగడం లేదని ఆవేదన చెందారు. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని సినిమా షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అవసరమైతే.. రెండు, మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌లు బంద్ చేయాలని అగ్ర నిర్మాతలు ప్రతిపాదనలు చేసినట్లు సినీ సర్కి్ల్స్‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో సినిమా షూటింగ్‌లు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై నిర్మాతలంతా కూర్చుని చర్చిస్తున్నామని తెలిపారు. షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై చర్చించినట్లు వెల్లడించారు. దీంతో పాటుగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయంపైనా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఓటీటీలో సినిమా విడుదలపైన చర్చించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇష్టం లేకుండా ఆ పాత్ర చేశా.. మహేశ్ సినిమాపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story