- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dil Raju: బాలీవుడ్‌లో దిల్ రాజు ఎంట్రీ.. డ్రీమ్ డెబ్యూగా నిలుస్తుందా?
దిశ సినిమా : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తన ప్రొడక్షన్ హౌస్‌ను ఇతర భాషల్లోకి విస్తరిస్తున్నాడు. ప్రస్తుతం రాంచరణ్-శంకర్, విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రెండు బైలింగువల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ఆయన కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 'జెర్సీ' మూవీతో బాలీవుడ్‌లోనూ నిర్మాతగా అడుగుపెడుతున్నాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న షాహిద్ కపూర్.. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' మూవీని అదే పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి ఒరిజినల్ మూవీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, అల్లు అరవింద్, అమన్ గిల్‌తో పాటు దిల్ రాజు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రొడ్యూసర్‌గా ఆయనకు ఇది డెబ్యూ మూవీ కాగా.. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాన్ని నైజాం ఏరియాలో విడుదలచేసిన దిల్ రాజు భారీ వసూళ్లు సొంతం చేసుకున్నాడు. మరోవైపు షాహిద్ గత చిత్రం 'కబీర్ సింగ్' సైతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు 'జెర్సీ'తోనూ అదే మ్యాజిక్ రిపీటైతే.. బాలీవుడ్‌లో దిల్ రాజుకు ఇది డ్రీమ్ డెబ్యూగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.